ముట్టుకాదు...అమ్మతనం

by Ravi |   (  Updated:2025-04-12 00:30:32  IST  )

Poem on tamilnadu period problem girl

ముట్టుకాదు...అమ్మతనం
X

ఆడపిల్ల పుట్టుకే ఓ పోరాటం,

బతుకు ఓ పోరాటం

వాళ్ళ జీవితమే పోరాటం

ఎన్నింటినో ఎదుర్కోవాలి,

ఎన్నింటితోనో పోరాడాలి

అందులో వాళ్ల ప్రమేయం

లేని పోరాటాలు ఎన్నో..

అమ్మ అవ్వడానికి

పడే నొప్పిని చూసావు..

చేతులెత్తి మొక్కుతావు

కానీ అమ్మాయి అయినందుకు

పడే నొప్పి గురించి

ఎప్పుడైనా ఆలోచించావా?

పురిటి నొప్పులు ఒక్కసారే భరించాలి

కాని దానికి కారణమైన నొప్పిని

ప్రతి నెలా భరించాలి.

ఎందుకంటే అమ్మాయికి

ప్రతి నెలసరి తప్పనిసరి

జంతు బలి పేరిట

అపవిత్రం కాని దేవాలయం

ప్రాణం పోసే రక్తంతో..

అయిపోయిందేంటో కలుషితం!

ప్రతి నెల తనలో జరిగే కథనాలు

నిత్యం సమాజంలో చెప్పుకునే కథనాలు

ప్రాణం పోసే శక్తులు ఉన్నది వాళ్ళకే

ప్రాణం పోయే నొప్పిని తట్టుకునేది వాళ్ళే

అందుకే ప్రతి నెల ఆ ఐదు రోజులు

ఎన్నో ఎమోషన్స్ భరిస్తారు..

ఆ క్షణం వాళ్లు కోరుకునేది

కొంచెం ప్రేమ, మీరున్నారనే ధైర్యం

అమ్మ కావడం అదృష్టమైతే

అమ్మాయిగా పుట్టడమే వరమేమో

ప్రాణం పోసే శక్తి ఉంది వాళ్లకేగా..

ప్రాణంగా ప్రేమించి చూడు

వాళ్ల ప్రాణంతో పాటు

ఇంకోన్ని ప్రాణాలు కూడా ఇస్తారు.

పీరియడ్స్ అంటే..

అంటరానితనం కాదు

అమ్మతనం ..

-గుర్రాల అనూష

ఓయూ స్టూడెంట్

Next Story