- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఒడిదుడుకుల గమ్యపు దారిలో
జనజీవన చక్రాలు దొర్లుతూ
హెచ్చు తగ్గుల బడలికలను
బలవంతాన భరించాల్సి వస్తోంది
ఇరుసు అరిగిన చందాన
బ్రతుకు బండి ఆగిపోయింది
ఎప్పుడు ఏ నిర్ణయం
పడగవిప్పిన పామై బుసకొడుతుందో
ఏ రోజున ఏ పరిణామం
విస్తరిస్తూ విరుచుకుపడుతుందో
హెచ్చు మీరిన తతంగాల హోరులో
తగ్గుముఖం పట్టే తీరులెన్నో
పెరుగుతూ పోయే ధరలతో
దిగబడిపోయే జీవనాలెన్నో
ఏదీ ఒక పట్టాన కుదురులేక
ఏదీ ఒక తీరున నిలకడలేక
ఏ కళ పట్టుతప్పి విహీనమౌతుందో
ఏ ధిక్కారం తగలబెడుతుందో
ఈ హెచ్చు తగ్గుల ఆలోచనలతో
సతమతమే తోడైతోంది
ఎన్నో ఎన్నెన్నో ఎదురు తిరిగే
కాల గతుల పరిణామాలు
ప్రకృతి వికృతుల వికారంతో
నిజం నిప్పై ఎగిసే ప్రేరణలతో
కనికట్టు తలకట్టుగా మారే వింతతో
ఏది సురక్షితమో
ఏది నిర్మానుష్య ప్రాంతమో
కనిపెట్టలేని తతంగాల మాయతో
మనిషి బ్రతుకు నీటి బుడగైంది
గుట్టు గుట్ట పెకిలిస్తేగాని
రాళ్ళ పొరల్లో మర్మం తెలియదు
మనసు లోతుల్లో మలినం కనబడదు
చిరిగిపోతున్న చీలికల మధ్యలో
నలిగిపోతున్న బ్రతుకు మూలాలెన్నో
ఎత్తు పల్లాల తికమకలతో
కుదించి కుదుర్చుకునే సర్ధుబాట్లెన్నో
కాళ్ళు ముడుచుకునే హద్దులెన్నో
ఎత్తుపల్లాల జీవనాల గతులలో
గాలివాటపు గమనాలెన్నో
- నరెద్దుల రాజారెడ్డి
9666016636
- Tags
- Poem






