ఆనందం అల్లుకుంటే..

by Ravi |   (  Updated:2026-07-19 23:45:22  IST  )

Poem

ఆనందం అల్లుకుంటే..
X

నీటిలోన తేలియాడే నిండైన

కలువల వనమును

బరువైన మనసు బదులు

కోరిన వేళ నిజము తెలుసుకునేది

నీళ్ల క్రింద దాగిన తీగల అల్లిక

పరుగెత్తి పాకుతు వనమంతా తిరుగుతు

తాను పరిచిన ఈ పూల వనము

తేలికైన మనసు హాయిగా తిలకించే

పూల సోయగము,

హృదయము పూచిన మల్లెలా

మనసు ఉప్పొంగిన వేళ

కష్టాల కడలిలో అలల సౌందర్యమై

బాధ్యతల సుడిగుండాలు

అందమైన పరిమళాలై

అల్లుకున్న తరుణమైతే

సుగంధాల వాయువులు కుటుంబాల

గదులతో కమ్మగా నిండితే

ప్రేమ పూర్వక వాతావరణం

ఇల్లంతా వ్యాపించితే

అంతా ఆహ్లాదమే అంతట సంతోషమే

ఉక్కపోత విసువలేదు

ఈర్ష్యా ద్వేషాల గొడవ లేదు.

- బొమ్మిదేని రాజేశ్వరి,

90527 44215

Next Story