తలంబ్రాల వర్షం..!

by Ravi |   (  Updated:2026-07-19 23:30:49  IST  )

Poem

తలంబ్రాల వర్షం..!
X

ఎన్నడూలేని నా హృదయ తివాచీపై

నీ తొలిచూపుల సూర్యోదయ

పుష్పపు పరిమళం వికసించింది.

ఎప్పుడూ లేని నా గుండె పొరల్లో

నీ తొలినవ్వుల చంద్రోదయ

సంగీతం సందడి చేసింది.

నీ తొలి పరిచయం

నాకో చిలిపి జ్ఞాపకం కాదు.

నేటి నా జీవన ప్రవాహం..!

నీ తొలి ప్రభావం

నాకో చెదిరిన కవిత కాదు.

నేటి నా తలపుల ప్రయాణం..!!

ఇదంతా ఎంతవరకంటే

తలంబ్రాల వర్షం మన

తనువుల్ని తడిపేసే వరకంది

నా ఆలోచనల ఆకాశం..నవ్వుతూ..!!

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story