- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

చూస్తున్నారా ఆ నీడలను
వింటున్నారా అవిచెప్పే నీతి సూక్తులను
దేవుడని సామాన్యులు నమ్మాలి
నీడలు వారిచ్చే కానుకలు తినాలి
ఆరోపణలు వస్తే నేరస్థులా..
ఆబ్బే.... అవి మాకు వర్తించవు
మేము నిధుల భోక్తలం
తప్పు దేవుడి భక్తులది
పది మెతుకుల పేదలకిపెట్టరు
హుండీలో పసిడి కిరీటాలు వేస్తారు
టన్నుల కొద్దీ బంగారం
రాసులకొద్ది నగలు, డబ్బు
మరి మా చేతుల్లో దురదపుట్టదా
మనసుల్లో దురాశ కలగదా
ఇరవైవేల జీతం ఏమూలకు
ఆలయం ఆస్తులు మా ఇళ్లకు
ధర్మం కోసం మా జీవితం
ఈ మాత్రం వద్దా ప్రతిఫలం
ఇదేగా దేవుడు చూపే మార్గం
మాదే తప్పనడం అన్యాయం
దేవుడి డబ్బు మాకనవసరం
అది భగవంతుని ప్రసాదం
అందుకే తినేసాం... తప్పా?
నీడలలో నీతి.. చూసారా..
సాటిమనిషి ఆకలిలో లేదా దైవం
కోట్లు దానం లోనేనా మోక్షం
మూఢ భక్తి వీడకపోతే
దేవుడిని కూడా వేలం వేసేస్తారు
విశ్వమానవ కైంకర్యం వారి నైజం
-భమిడిపాటి గౌరిశంకర్
94928 58395
- Tags
- Poem






