- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తెలియకుండానే
నీ దారి కొచ్చాను
ప్రేమనే అనుకున్నా
నిన్ను చేరుకోనే దాక
ఒంటిమీద వాతలు తేలాక
తెలుసుకున్నా వంచనని
వంచింప బడ్దానని
కూలిన కలలు
ఇంకిన కన్నీళ్ళు
గుండె గాయాలలో
గురుకొస్తున్నాయి
'నా కన్నపేగువి
నిన్ను నమ్మనా తల్లి '
అన్న అమ్మ పలుకులు
'టీనేజ్ శలభం లాంటిది
ఆకర్షణ తప్ప
ఆలోచన వుండదు,
అయినా నీవు
నా కూతురివి జాగ్రత్త'
అన్న నాన్న మాటలు
చాటింగ్, గిఫ్ట్స్
"ఆకర్షణ గాలానికే ఎరలు"
అని తెలుసొచ్చాక
చావాలనుకున్నా
మరణం పిరికితనమని
మానుకొని
నా జీవితపాఠాన్ని
యువతకు బోధించి
ఆకర్షణకు ఎగరమారే
శలభంలా కాకుండా
దారి చూపే దీపంలా
నిలపాలనుకున్నా !
- సురేంద్ర రొడ్డ
94915 23570
- Tags
- Poem
Next Story






