- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
“ఏం చేస్తున్నావ్”
కలుస్తున్న పాత ముఖాలన్నీ
మాట కలుపుతున్న కొత్త తీరే ఇది
“ప్రజల గొంతుకనై పాట పాడుతున్నా,
ప్రశ్నించే గొంతుకులకు మాట కలుపుతున్నా,
కనిపించే లోపాలపై కలాన్ని సంధిస్తున్నా,
కనికరించని పాలకులపై నిప్ప్పులు పోగేస్తున్నా
...ఇంకా ఏం చేయ్యాలి”
“ఇవన్నీ చూస్తున్నాం.. అంటే,
ఏం పనీ చెయ్యడం లేదా? అని”
"బాల్యమంతా పశువులు కాసా,
యవ్వనమంతా పహారా కాసా,
జుత్తు నెరసిపోతున్న వేళ,
సమాజంలోని చెత్తను ఏరుతున్నా”
సంపాదించే యావ మాత్రమే
మనిషి చెయ్యాల్సిన పని కాదని
సమాజ బాగోగులు కూడా ఉంటాయని,
ఇంకా.. ఇంకెంత మందికి చెప్పుకోవాలో!?
-వినోద్ కుత్తుం
96343 14502
- Tags
- Poem
Next Story






