మనిషి... ఇంకా మనిషేనా?

by Ravi |   (  Updated:2026-07-05 23:30:49  IST  )

Poem

మనిషి... ఇంకా మనిషేనా?
X

ఏమైపోతోంది సమాజం

ఎటువైపు పయనిస్తోంది?

భావాలకు, బంధాలకు

అర్థం మారే దిశగానా?

ఒకవైపు టెక్నాలజీ

శిఖరాలను అధిరోహిస్తున్నాం...

మరోవైపు మనల్ని నమ్మిన వారినే

మోసం చేయడంలో పోటీ పడుతున్నాం.

ఫ్రీడమ్ అంటే ఎదుటివారి

మనసును గాయపరచడమా

నమ్మకాన్ని ద్రోహం చేయడమా

బాధ్యతలను వదిలించుకోవడమా

సెకన్లలో మారిపోతున్న ప్రేమలు...

క్షణాల్లో ముగిసిపోతున్న ఇష్టాలు...

నిమిషాల్లో తెగిపోతున్న బంధాలు...

అభివృద్ధి అంటే కేవలం

సాంకేతిక పురోగతి కాదు...

మనిషిలో మానవత్వం, విలువలు,

నమ్మకం, బాధ్యత కూడా పెరగాలి.

ఎందుకంటే... సమాజాన్ని

మార్చేది టెక్నాలజీ కాదు,

మనిషి మనసు. మనిషి మారితేనే

సమాజం మారుతుంది.

-రాచకొండ సాగర్

70958 22883

Next Story