- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కొన్ని గోడలు
ఇటుకలతో కట్టబడవు,
మనసుల మధ్య
నిశ్శబ్దంగా పెరుగుతాయి.
కొన్ని దారులు
అందరికీ ఒకేలా కనిపించినా,
అందరి అడుగులను
ఒకేలా ఆహ్వానించవు.
ఈ గాయం చర్మంపై కనిపించదు,
కానీ నేటి మనుషుల్లోనూ
మౌనంగా మండుతూనే ఉంటుంది.
ఇదే కనిపించని ' కుల' గాయం.
చదువు పెరిగినా..
సాంకేతిక యుగం వచ్చినా..
కృత్రిమ మేధా దూసుకుపోతున్నా..
'కుల' సామాజిక చీకట్లు మాయం కాలేదు.
రాజకీయాన్ని, వ్యాపారాన్ని శాసిస్తుంది,
విద్య, వైద్యంలో ప్రవేశించింది.
ఇది మనకు తెలియకుండానే
జరుగుతున్న ఓ ఆధిపత్య
'కుల' మాయజాలం.
'కుల' గాయాలు పోవాలంటే
బహుజనుల్లో చైతన్యం,
ఆధిపత్య కులాల్లో పరివర్తన రావాలి.
ఇవే 'కుల' గాయానికి విరుగుడు.
-సంపతి రమేష్
7989579428
- Tags
- Poem
Next Story






