జాతి నిర్మాత ఆమే..!

by Ravi |   (  Updated:2026-06-14 23:45:45  IST  )

Poem

జాతి నిర్మాత ఆమే..!
X

జాతినిర్మాత ఆమె...

అవును ఆమె

కాదని ఎవరనగలరు

పాలిచ్చి పెంచిన చేతులు

పాలించే నేతలు వారు

శ్రమ, చెమట విలువల ప్రతీకలు

ఉచిత సేవలకు చిహ్నలు

పైసా ఆశించని పనివారు..

అయినా చిన్న చూపు...

ద్వితీయ వర్గపు ఓటర్లే వారు

సుప్రీం వ్యాఖ్యనం..నిశ్శబ్ద ఛేదనం

చెర్నకొలు... చరుపుల శబ్దం

చర్మం.. కొందరికి మందం

అమలు చేయటం ఎలా...?

శతాబ్దాలు పట్టింది సంస్కరణకి

మరి... ఈ తీర్పు ఆచరణకు?

విరి లేని ప్రపంచంలో సిరి ఉండదు

జాతి నిర్మాతలను అందించేది స్త్రీ

అయినా... అలుసే..

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Next Story