అక్షౌహిణులను కాపాడేవాడే వీరుడు

by Ravi |   (  Updated:2026-06-14 23:30:42  IST  )

Poem

అక్షౌహిణులను కాపాడేవాడే వీరుడు
X

ఎవడైనా వీరుడు మాట్లాడుతుంటే

నాకు చాల దుఖ్కమవుతుంది

వీరాలాపాలు అన్నీ నెత్తుటి కన్నీళ్లే

వీరుడు ఎంత మందిని చంపితే

అన్నిసార్లు అంత మందిగా మరణిస్తాడు

హంతకుడు ఎన్ని హత్యలు చేస్తే

అన్నిసార్లు అన్ని ఆత్మలుగా, సీరియల్

ఆత్మహంతకుడవుడవుతాడు

ఉన్న ఒకే ఒక్క ముళ్ల పరుపు మీద

మరీ అన్నిసార్లు భీష్మ గీతమై

కోరికోరి దుఖ్కపడటం కన్న..

లోకం లోని మరణాలలో మొట్టమొదటిది

తనదవాలని కోరుకునే మొనగాడే, నిజంగా

అక్షౌహిణుల దుఖ్కాన్ని వారించే వీరుడు

- హెచ్చార్కె

+1 (609) 647-2863

Next Story