నీకు ఆగ్రహం రావాలని కోరుకుంటున్నా!

by Ravi |   (  Updated:2026-06-07 23:31:15  IST  )

Poem

నీకు ఆగ్రహం రావాలని కోరుకుంటున్నా!
X

నా ప్రియాతి ప్రియమైన అమ్మా!

నీకు కోపం రావాలని కోరుకుంటున్నా!

కోపం కూడా కాదు ఆగ్రహం!

అదీ తుఫాను లాంటి ఆగ్రహం!

కిటికీ అంచులని తోసుకుంటూ

వంటింటిని అతలాకుతలం చేసి

ముంచి వేసేంత ఆగ్రహం!

మరుక్షణమే నిన్ను

ప్రశాంతత లోకి నెట్టేసే ఆగ్రహం!

చాలా బలంగా కోరుకుంటున్నా!

ఓహ్ నా ప్రియాతి ప్రియమైన కూతురా!

నీకు కావలసినంత ఆగ్రహం

రావాలని నేనూ కోరుకుంటున్నా!

ఎలాంటిదంటే తట్టుకోలేనంత ఆగ్రహం!

నువ్వు ఒట్టి ఆడదానివి,

నువ్వు ఏమీ చేయలేని బలహీనురాలివి

అంటూ నిన్ను నిలువరించే

అన్నింటినీ విధ్వంసం చేసి,

కూల్చిపడేసేంత ఆగ్రహం అన్నమాట!

ఓ స్త్రీ ! నేనేం కోరుకుంటున్నానంటే

ఒక నిర్ణయాత్మకమైన,

ఖచ్చితమైన కోపంతో

నువ్వు చేయాలి,చేయద్దు

అనే నిబంధనలన్నింటినీ

ఆ భయంకరమైన,

విధ్వంస కరమైన వేగంతో

దూసుకు వస్తున్న

బస్సు కిందికి తోసేయ్ !

ఇక అన్నింటినీ,

నువ్వు కోరుకున్న అన్నింటినీ

ప్రారంభం నుంచీ మొదలు పెట్టు!

అన్నీ కొత్తగా, అన్నీ సమానంగా!

ఇంగ్లీష్ -మౌమితా ఆలం

అనువాదం -గీతాంజలి

88977 91964

Next Story