- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
ఇప్పటి ముఖంలా
రేపటి నా ముఖం ఉండకపోవచ్చు
గాట్లో.. గాయాలో
ఆత్మ విశ్వాసాన్ని పరిహసిస్తూ
నా ముఖ వర్చస్సును
చిన్నాభిన్నం చేయవచ్చు
ఒక అసంకల్పిత ఘటన
పెదాల పైన నవ్వును
కళ్ళల్లోని వెలుగును
నిర్ధాక్షిణ్యంగా చిదిమివేయవచ్చు
అయితేనేం.. ఆ ముఖం
తాలూకు మనసు ఉంటుంది కదా..
అదెప్పుడూ స్వచ్ఛమైనదే!
మాయలు మచ్చలు లేని
వెన్నెల తరగ లాంటిదే
వాగ్దానాన్ని మరువని
చేతిలో వేసిన చేయి లాంటిదే!
ఇంకా.. ఆ మనసెప్పుడూ
మాసిపోని పువ్వులా
ముఖంపై పరిమళిస్తుంది
జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని
ఆత్మీయంగా పలవరిస్తుంది
తన మునివేళ్ళతో
ముఖాన్ని తడుముతూ
ఒడిలోకి చేర్చుకొని
వెచ్చటి ఓదార్పునిస్తుంది
-సునీత గంగవరపు
94940 84576
- Tags
- Poem
Next Story






