అధికులం..

by Ravi |   (  Updated:2026-06-07 22:01:02  IST  )

Poem

అధికులం..
X

చనిపోతే అంతా చెదిరిపోతుందా?

శాశ్వతంగా నిలిచిపోతుందా..

అని తెలియకే ఇన్ని అకాల మరణాలు..

ఇంత జీవితం..

మళ్ళీ సాధించాలంటే మాటలా?

తప్పుకుంటే తిరగలివవుతావు తప్ప

తీర్పరివి కాలేవు..

సుఖం, దు:ఖం, స్నేహం, ప్రేమ

వియోగం, విరహం ప్రతీదీ ఒక ఉత్సవం..

గ్రహిస్తేనే ఆనందంగా వుంటాం

లేకుంటే బతికుండగానే

చనిపోయినట్లే అవుతాం!

మనకేం కావాలో మనకే తెలియదు.

ఎవరికి ఏది ఇవ్వాలో తెలియదు.

ఎవరి దగ్గర ఏది తీసుకోవాలో తెలియదు.

ముఖ్యంగా మనల్ని మనం

ఎలా కాపాడుకోవాలో తెలియదు

తలుపు చప్పుడయిన ప్రతిసారీ

ఎవరూ అంటూ ఉలిక్కిపడినంతకాలం

ఈ లోకానికి మనం అతిధులమే.

అనుభవ సారాన్ని కోల్పోయిన అధికులమే..!

-శైలజామిత్ర

92909 00879

Next Story