- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
మట్టిలో పాతిన ప్రతి
గింజా చెట్టవ్వదు
కొన్నింటిని కాలమే
శవపేటికలా మూసేస్తుంది.
వాన వచ్చినా
వెలుగు పలకరించినా
కొన్ని విత్తనాల గుండెల్లో
రుతువులు తలుపు తట్టవు.
ఒక రైతు అరచేతిలో
పగిలిన భూమి రేఖల్లా
అవి నిశ్శబ్దంగా పడి ఉంటాయి.
ఆకలితో ఎండిపోయిన నేల
మొక్కలుగా కాదు,
అనాధ పిల్లల్లా
కౌగిలించుకుంటుంది.
చిగురుకాలం వచ్చినప్పుడల్లా
పక్కనే ఉన్న గింజలు
పచ్చని జెండాల్లా ఎగిరిపోతుంటే,
ఇవి మాత్రం చీకటినే
దుప్పట్టిలా కప్పుకుంటాయి.
బహుశా -
మొలకెత్తకపోవడం కూడా
ఒక నిరసన కావచ్చు;
రక్తం తాగిన భూమిపై
పచ్చదనం రాయడానికి
కొన్ని విత్తనాలు
సంతకం చేయకపోవచ్చు.
- యండి. ఉస్మాన్ ఖాన్
- Tags
- Poem
Next Story






