మన్యం అంతా గుప్పున లేద్దాం..

by Ravi |   (  Updated:2026-05-24 23:45:42  IST  )

Poem

మన్యం అంతా గుప్పున లేద్దాం..
X

వలస కాదిది తరుముడు..

వనాల కెల్లి మైదానాలకు..

గుడిసెల కెల్లి గూడ్యాలకెల్లి..

గూళ్ళిడిపించి తంతూ తర్మిరి..

అడవి గర్భం దోయుటకా..

దోసి తవ్వుకు ఎత్కెళ్ళుటకా..

గిరి పుత్రుల హింస బెడ్తూ..

దేశ దేశముల దొంగల కిస్తరా..

చీకటి బతుక్కు వెలుగని జెప్తూ

మంటలు బెట్టి బూడిద జేసిరి

వన్నాఫ్సెవంటీ సేతుల్ నర్కిరి..

పేసా యాక్టూ కోరలు పీకిరి..

మువ్వన్నెల భరోస నిచ్చి

ముప్పై సెర్ల నీళ్లు దోసిరి

జన్మ నిచ్చిన జంగల్ రక్షణే..

జీవుల లక్ష్యం ఐతేనే గెల్పు..

గూడెం పెంటా ఒక్కటి అయ్యి..

మన్యం అంతా గుప్పున లేద్దాం..

-ఇక్బాల్

94407 75732

Next Story