- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వాళ్ళు బానిసకు ఒకరోజు సెలవిచ్చి
తమ దయకు కృతజ్ఞులై
ఉండమని ఆజ్ఞాపిస్తారు
ఇప్పుడు వాళ్ళు వారాంతంలో
రెండురోజులు సెలవిచ్చి
స్వేచ్ఛను ప్రసాదించినట్టు
ప్రకటించుకుంటున్నారు
ఆధునిక చెరసాలలెప్పుడూ
సంకెళ్లు గొలుసులతో రావు
కొన్నిసార్లు అది అప్పులు, అద్దెలు,
అలసట, ఎడతెగని పని రూపంలో
ఇంకా ఆ నెల జీతం ఎక్కడ
తప్పిపోతుందోనన్న
భయం రూపంలో వస్తుంది
చెరసాల ఇనుపతెరలు కనిపించవు
వ్యవస్థ చాలా మర్యాదపూర్వకంగా కనిపిస్తుంది
విధేయత పరివ్యాప్తమవుతుంది
సాధారణ జీవితంకోసం ఒక్క తప్పు
కూడా చేయకూడదని నేర్పడమే
చరిత్రలో అత్యంత శక్తివంతమైన జైలు.
- ఫ్రెడెరిక్ డగ్లస్
- కట్టా శేఖర్ రెడ్డి
96760 99999
- Tags
- Poem
Next Story






