వాళ్ల ప్రేమ

by Ravi |   (  Updated:2026-05-25 01:00:24  IST  )

Poem

వాళ్ల ప్రేమ
X

ఇద్దరు ప్రేమికులు!

ఒక కమ్యూనిస్టు- ఒక సంపాదకుడు!

ఇద్దరూ మంచి శృంగారంలో ఉన్నారు!

కమ్యూనిస్టు..

విప్లవం అంటూ మూలుగుతున్నది.

ఎడిటర్ ఆమె మూల్గులో ఉన్న

సాంకేతిక తప్పిదాన్ని ఎత్తి చూపాడు.

ఆమె విప్లవం అంటున్నప్పుడు

ఊపిరిని పూర్తిగా బయటికి

వదలడం లేదన్నాడు.

అతను కూడా ఆమెకి

చనుమొనలు లేనందుకు బాధపడ్డాడు.

అతిగా ఉద్రేక పడిన కామ్రేడ్ ఒకడు

వాటిని కొడవలితో కోసేసినట్టు

కమ్యూనిస్టు బాధగా చెప్పింది!

విప్లవం ఇంట్లోనే మొదలవుతుందని

వాళ్ళు చెప్పారట మరి!

ఆమె అతని వేళ్ళ వైపు

విచిత్రంగా ఏంటలా కాలిన

మచ్చలున్నాయన్నట్లు చూసింది.

అతను నవ్వుతూ,

"మంచి డిమాండ్ ఉన్న పుస్తకాలని

కాల్చేసేటప్పుడు కాగితాల్లోని

మృతి చెందిన పదాలలో నా వేళ్ళని

ముంచి కాల్చుకున్నాను" అన్నాడు!

ఆకాశం ఎర్రబడ్డ ఆ క్షణాల్లో,

ఊగిపోతున్న తెరచాప స్తంభం సాక్షిగా

ఆరోజు కొన్ని కొత్త నక్షత్రాలు పుట్టాయి!

ఆంగ్ల మూలం-మౌమితా ఆలం

అనువాదం- గీతాంజలి

88977 91964

Next Story