ఉరితీసే వేళ

by Ravi |   (  Updated:2026-05-25 00:45:21  IST  )

Poem

ఉరితీసే వేళ
X

అయ్యా... అమ్మా...

మీ మీద నాకు పగ, కోపం లేవు

నా ధర్మం నేను చేస్తున్న

ఒక్కసారి.. ఈ ఒక్కసారి

నన్ను మన్నించండి

ధర్మం కోసం చేస్తున్న..

మీ సుఖవంతమైన ప్రయాణం

నేను కోరుకొనే వృత్తి

మీ మంచి కోసమే...

ఓ తలారి వేదనా హృదయం

ఇక్కడ చూడండి ఇదేదో చిత్రం

పెట్రో ధరలు పెంచం..

భయం వద్దు. మరే ధరలు పెంచం

అయినా ఉచితాలు ఉన్నాయిగా

కొద్ది రోజులే ఈ కష్టాలు..

తరువాత... మీకలవాటై పోతాయి

మళ్ళీ..మేము..మీరు మామూలే

ధరల పెంపు మీ కోసమే

పొదుపు చేయండి... దేశం కోసం

మేము విమానాల్లో తిరుగుతాం

మీ కోసమే... అది కూడా

కాస్త నడుం వంచండి ప్లీజ్

కొంచం మెల్లగా కొడతాం.. అంతే

-భమిడిపాటి గౌరిశంకర్

94928 58395

Next Story