ఎండ మీద ఎండ

by Ravi |   (  Updated:2026-05-17 23:30:42  IST  )

Poem

ఎండ మీద ఎండ
X

ఎండాకాలం

ఎప్పుడు కొత్త అనుభవమే!

ఎండకాలం అనగానే

ఎక్కడా లేని ఉష్ణతాప భయం!

ఎండ ఎప్పటిలా ఉన్నా

ఎందుకు ఎండ మీద నింద వేస్తున్నం !

ఎండకు మనమే ఆజ్యం పోస్తున్నం!

ఎండను గ్రహించే

వృక్ష రాజాలను తొలగిస్తున్నం!

ఎండను పరావర్తనం చెందించే

కంకర స్లాబులను నిర్మిస్తున్నం!

పరిశ్రమలు వాహనాల వేడి సెగలు

పొగలు పెంచుతున్నం!

ఎండను మరింత వేడెక్కిస్తున్నం!

ఎండ మీద ఎండ అంటే ఇదే !

- పట్లొళ్ళబక్కారెడ్డి

97053 15250

Next Story