- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అక్షర దివ్వెల వెలుగే జ్ఞానం,
ప్రశ్నించే ధైర్యమే జ్ఞానం.
అమ్మ పలుకుల్లో భాష జ్ఞానం,
గురువు బోధలో శక్తి జ్ఞానం.
నాన్న చూపే సన్మార్గం జ్ఞానం,
భార్య ప్రేమలో మమత జ్ఞానం.
స్నేహపు మాటల్లో ఓదార్పు జ్ఞానం,
సమాన సూక్తిని నేర్పే మరణం జ్ఞానం!
త్యాగ జీవుల్లో సేవే జ్ఞానం.
అహాన్ని విడిచి నడవడం జ్ఞానం,
భూతదయతో బ్రతకడం జ్ఞానం.
శాంతి మార్గమే నిజ జ్ఞానం,
పరమాత్మ చేరువే పరిపూర్ణ జ్ఞానం.
-ప్రవీణ్ సాగర్ చిలుక
9963939963
- Tags
- Poem
Next Story






