మననం చేసుకో...!

by Ravi |   (  Updated:2026-05-18 00:00:47  IST  )

Poem

మననం చేసుకో...!
X

ఎల్లప్పుడూ ఎంతసేపూ

ఎదుటి మనిషి తప్పులు

ఎంచడమేనా.....?

ఒక్కసారి ఆత్మ సాక్షిని తలచి

నీ తప్పులను మననం చేసుకో!

ఇతరుల తప్పులను

వెదికే ముందు తప్పక

మహాకవి వేమన చెప్పింది

గుర్తు తెచ్చుకో......!

''ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు''

అందుకే...... త్రికరణ శుద్ధిగా

బాధ్యతాయుతంగా

నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు!

ప్రతి యొక్కరికి మంచిని పంచు!

-మరికంటి

9640407103

Next Story