నిరీక్షణ రూపాలు

by Ravi |   (  Updated:2026-05-11 00:01:16  IST  )

Poem

నిరీక్షణ రూపాలు
X

నేను నీకోసం నిరీక్షిస్తే

నువ్వు బహుశా తిరస్కరించవచ్చు!

అదే నువ్వు నా కోసం నిరీక్షించావనుకో

ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను!

ఇక నీ ఇష్టం!

ఆమె కోపంలో అన్ని వస్తువులూ

పగలగొట్టేస్తుందని విన్నాను!

ఆ ఖుదా కాస్త దయ చూడుగాక!

నా హృదయం ఆమె దగ్గరే ఉంది మరి!

ఏకాంతంలో ఆమె జ్ఞాపకాలు

కమ్ముకున్నప్పుడు, ఓహ్ ఏం చెప్పను

మృత్యువు కూడా తక్కువే

అనిపిస్తుంది ఆ శిక్ష ముందు!

నీ కంటే నీ జ్ఞాపకాలే మంచివి ఫో!

ఏడిపిస్తాయి కానీ నీలా వదిలి పెట్టి పోవు!

తానే అందగాడినని

ఆ చంద్రుడికి మహా గర్వం!

రోజూ రాత్రి డాబా మీద కొచ్చి

మిడిసి పడతాడు!

నిన్న రాత్రి నేను కూడా

వాడికి నీ ఫోటో చూపించా!

అంతే తోక ముడిచాడు!

మూలం: గుల్జార్

అనువాదం: గీతాంజలి

88977 91964

Next Story