ధైర్యపు చిరునామా

by Ravi |   (  Updated:2026-05-11 00:15:48  IST  )

Poem

ధైర్యపు చిరునామా
X

చీకటి ముసిరిన దారుల్లో...

నా చిన్న చేతిని పట్టుకుని

నడక నేర్పిన తొలి వెలుగు నువ్వు.

కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని

చిరునవ్వును మాకు పంచిన

నిశ్శబ్ద వీరత్వం నువ్వు.

ఆకలి సెగ మాకు తగలకుండా

నీ భాగాన్ని నిస్వార్థంగా వదిలేసిన

త్యాగమూర్తి నువ్వు.

నేను పడిపోయిన ప్రతిసారి

నాలో ఆత్మవిశ్వాసం నింపే నీ మాటలు

నా విజయాలకు వారధి.

పేరు లేని పోరాటాలన్నిటికీ

ముద్ర లేని విజయాలన్నిటికీ

ఒకే ఒక్క నిలువెత్తు సాక్ష్యం అమ్మ.

ధైర్యం అంటే..

ఎదురుదాడి చేసే శబ్దం కాదు,

నిశ్శబ్దంగా భరించే మహాశక్తి...

ఆ శక్తికి అసలైన చిరునామా అమ్మ!

-డా. ఆవుల రేణుక

9398268976

Next Story