- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మెల్ల మెల్లగా పురోగతి పేరుతో
నీ గొంతు నులిమేస్తున్నారు
కూర్చున్న కొమ్మనే
నరుక్కునే అజ్ఞానాంధులు
ముందు చూపు లేని మంద బాలలు
అయ్యో నిన్ను కాపాడే వాళ్లే లేరా
నీ పచ్చటి ప్రపంచాన్ని పాడుచేస్తున్నారు
నీ వెచ్చటి ఊపిరిని ఆపేస్తున్నారు
సూర్య రశ్మిని సైతం లోపలికి రానివ్వని నువ్వు
సృష్టిని కూడా హతమార్చాలనే
రాక్షసులను అడ్డుకోలేవే
కోటిరాసులకు నిలువ నీడనిచ్చే నువ్వే,
నిస్సహాయమై నిలిచావు
నువ్వు లేని లోకంలో
వానల గానం నెమ్మదిగా మూగబోతుంది
నీ పచ్చని పరిమళం మాయమవుతుంది,
భూమి తడి ఆవిరై బీడైపోతుంది
పెద్ద చెట్లను నరికిన క్షణమే,
సూర్యుడు దాడి చేస్తాడు
నేలంతా ఎండిపోయి,
ఎడారి ఏడుపు పాట పాడుతుంది
నిన్ను నగ్నంగా నిలబెడితే…
భగ్నమయ్యేది భావి తరాల ఆశలే
నికోబారమా,
నీ భారాన్ని మోసే భుజాలు ఎవరవి?
నిన్ను కాపాడే బాధ్యత ఎవరిది?
నా కడుపులోనో, నా కౌగిలిలోనో
నిన్ను దాచెయ్యలేని
నా నిశ్శక్తిని క్షమించు
-ప్రయా
76750 34380
- Tags
- Poem






