- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వారు నన్ను అంగారక గ్రహంలో
నివసించడానికి రమ్మన్నారు
చంద్రుడిలో స్థలం కొనుక్కోమన్నారు
సుదూర నక్షత్ర మండలంలోని
ఒక అద్భుత గ్రహానికి
ప్రయాణం చెయ్యడానికి
సిద్ధం కమ్మన్నారు
వారితో చెప్పాను
ఈ భూమి, నేనూ వేరు కాదని
ఈ భూమి లేకుండా నేను లేనని
ఈ మట్టి నుండి నేను జన్మించాను
తిరిగి ఈ మట్టిలోనే కలిసిపోతాను
ఈ మట్టి తప్ప నేను మరేమీ కాను
నా దేహం ఇక్కడి
ఖనిజాలతోనూ, లవణాలతోనూ
జలాలతోనూ, పవనాలతోనూ
పరిమళాలతోనూ, పక్షుల స్వరాలతోనూ
వృక్షాల కరుణతోనూ
సూక్ష్మజీవులు చేయూతతోనూ
నిర్మితమయింది
వాటిని నా నుండి తీసివేస్తే
నా దేహం కరిగి అదృశ్యమవుతుంది
నువ్వు అంతరిక్షం
నుండి చూసినప్పుడు
నీలిరంగులో మెరిసే
ఈ నీటి గ్రహంతో
అవిభాజ్యంగా ఒదిగిఉన్న
నన్ను కూడా చూస్తున్నావు
- శ్రీరామ్
- Tags
- Poem
Next Story






