భళ్లున పేలద భూగోళం..

by Ravi |   (  Updated:2026-05-04 00:15:59  IST  )

Poem

భళ్లున పేలద భూగోళం..
X

పిల్లలపై ఎలుకల

విశృంఖల దాడి

బడా దవఖానాల్ల

వార్త పాతబడ్డది

ప్రమాదమిప్పుడు

దేశామంతా పాకె

ఆ ఎలకలిప్పుడు

పందికొక్కులాయె

ఇంటింటా జోర్రి

బతుకుల్లో దూరి

పాడెలు పరిచేసి

పండగ జేస్తున్నై

పల్లే పట్నం ఏదైనా

ఉత్తర దక్షిణ తేడేది

పాలక పార్టీ లేవైనా

కొక్కులంతా క్షేమం

డెమాక్రసి దీని పేరు

ఓటుమెజార్టే ప్రాణం

బ్యాలట్ పెట్టెల్జెల్లవ్

ఎలక్ట్రానిక్లు ఆగవ్

పోలింగ్ స్టేషన్డూపిక

నీవు నేనూ మాసరా

చేతులు మారే కట్టల్

నేతల్ ఎదిగే పుట్టల్

హక్కుల కొరకనుకోకు

చెరబడ్డది రాజ్యాంగం

దుడ్డు దొరల గడీలల్ల

ఎన్నికల షెడ్యుల్వేషం

మరిచి తెరిచితే నోరు

అన్యాయాలన్కుంటు

ఖైదుజేసీ ఖైమాజేస్తరు

గీతదాటితే దిగేది గోలే

అంగారో అది చింగారో

కగారో మరొక కంగారో

అడవెల్ల ఆపరేషనుల

కడుఘోర రక్తపు హోళీ

జాతిపతాక ఎదపై రేగే

హాహా కారపు జనహోరై

కట్టలు తెగిన ఆగ్రహమై

భళ్ళున పేలద భూగోళం

- ఇక్బాల్

94407 75732

Next Story