పిట్టవైనా కాకపోతివి

by Ravi |   (  Updated:2026-04-26 22:15:03  IST  )

Poem

పిట్టవైనా కాకపోతివి
X

పొన్నంకి పిట్టవైనా కాకపోతివి

ఎండ వేడిని తట్టుకోలేక

అరవల్లి అడవులకు

పారిపోవడానికి

చిట్టి చీమవైనా కాకపోతివి

లోతుగా సొరంగాలు తవ్వి

చల్లదనం కోసం

భూగర్భంలో దాక్కోవడానికి

కర్దమ కలుషితమైన,

కరుణ బాసిన సమాజంలో

కేవలం పేద పనిమనిషివి నీవు

నీపై జాలి చూపించాల్సిన

కరుడుగట్టిన సూర్యుడు

వేడిని వడ్డిస్తున్నాడు

వడగాల్పులు నిన్ను

వాటేసుకుంటున్నాయి

మావి చిగురు రెమ్మ చాటునో

నల్ల నేరేడు పండ్ల మధ్యనో

దాక్కుని పాడుకునే కోయిలలా

ఉల్లాసంగా ఉండే నేను

నీ కష్టాలు చూసి నిలువలేక

ఏం చేయలేక, చితికిపోతూ

చేతకాని ఆలోచనల్లో మునిగి

వేదనను వచనాలుగా అల్లుతున్నాను

-ప్రయా

76750 34380

Next Story