- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
గాలికేం తెలుసు
మా ఇంటిని తాకే
ఊరు నడిబొడ్డుకి !
కనిపించేదైతే
మేం శుభ్రపరచగలం
మరి లోలోపలది !
ఊరు ఎప్పుడో
పొలిమేర దాటింది
మేమింకా బయటే !
ఎవరికి ఓటేసినా
ఎందుకో
ఇప్పటకీ మేము గెలుస్తలేం !
దయచేసి అటు ఎవరూ వెళ్ళొద్దు
కులసమావేశమేదో
జరుగుతున్నట్టుంది !
- తిప్పాన హరి రెడ్డి
9493732412
- Tags
- Poem
Next Story






