- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈయన యవ్వారం చిత్రంగా ఉంది
"ఒబ్బి, ఒబ్బి, నీవు దంచితే,
నేను ఒంపుతాను" అన్నట్టుంది
చెప్పిన మాట బుద్ధిగా విన్నవాళ్ళం
ఇద్దరూ లేక ముగ్గురంటే
ఒక్కరితో సరి పెట్టుకున్నోళ్ళం
దేశాన్ని జనవిస్పోటనం
నుండి కాపాడినోళ్లం
మనకు శాలువా కప్పి
ఏదైనా బిరుదు ఇవ్వాల్సింది పోయి
మనల్ని శిక్షిస్తామంటే ఎలా!
హోంవర్క్ చెయ్యని వాడిని
బడిలోకి రమ్మని, చేసిన వాడిని
ఎండలో నిలబెట్టేదేంది?
ఈ ప్రధాన పంతులు
వ్యవహారం తేడాగా ఉంది
మాట వినకుండా చదువుకోకుండా
గుర్రాల మీద తుపాకులతో తిరిగిన
బందిపోట్లని" బీమర్" లనీ
ఏసీలో పెడుతున్నాడు
కష్టపడి చదివినోళ్ళం
సంపద పెంచినోళ్ళం
ఒళ్ళు వంచి వ్యవసాయం చేసినోళ్ళం
దేశాన్ని నిలబెడుతున్నోళ్లం
దక్షిణాది వాళ్ళం దక్షిణ వేసేవాళ్ళం
ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకనోళ్ళం
మనల్ని ఎండలో
మోకాళ్ళ మీద నిలబెడితే ఎట్లా!
ఈ ప్రధాన పంతుల
వ్యవహారం చానా తేడాగుంది
పాన్ పరాగ్లు నమిలి
గోడల మీద పూసే వాళ్లకు
చేతిలో రూపాయి మూసిపెడితే
మూడు రూపాయలెట్లా అవుద్ది
మనం రూపాయి గాల్లోకి
ఎగరేసి పట్టుకుంటే
పావలా ఎట్లా అయిపోద్ది !
ఆ పయ్యోళ్లు కొండమీద
బండల్లాంటోళ్ళు మనం కొండ కింద
మనుషులు లెక్కయ్యింది
మన బతుకు గురివింద
తీగ కింద మొక్కయింది
పద్మవ్యూహంలో
అభిమన్యుడి మాదిరయ్యింది
జర భద్రం నాయకులు !
మీ యవ్వారాలు పక్కన పెట్టండి !
మేలుకోకపోతే కోలుకోలేము
జర భద్రం నాయకులూ జర భద్రం!!
-పాణిరావు యర్రగుంట్ల
62817 19414
- Tags
- Poem






