- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తడారిన గొంతుల దప్పిక తీర్చలేని
సముద్రం తలాపున ఉండేమి లాభం..?
మంచి నీటి చుక్కతో ఊరట నిచ్చే
ఊట చెలిమేనే నయం కదా !
అవసరాలకు అక్కరకు రాని
బంధు జనాలు పెద్ద పెద్ద స్థాయిలో
ఉండేమి లాభం..?
ఆపద కాలంలో ఆదుకునే
పరోపకారులే గొప్ప కదా!
నీడనివ్వని చెట్లు ఎంత ఎత్తులో
ఉండేమి లాభం..?
పదిమంది సేద తీర్చే
చిన్న చెట్లే ఫలం కదా !
- దుర్గమ్ భైతి
99590 07914
- Tags
- Poem
Next Story






