పేరు లేని చెట్టు..

by Ravi |   (  Updated:2026-04-20 00:30:33  IST  )

Poem

పేరు లేని చెట్టు..
X

నా కాళ్ల వేళ్లు

భూమిని హత్తుకుని వున్నాయి

నా నాలిక మట్టిది

నా వెంట్రుకలు లేత చివుళ్ళు

నేనొక పేరులేని చెట్టును

కాకులకు, పావురాలకు,

రాబందులకు, కోకిళ్లకు కూడా ఆవాసాన్ని.

నేనొక పేరులేని చెట్టును

పచ్చిక బయళ్ళలో ఒంటరిగా నిలబడ్డా

స్థిరంగా నిలబడే చరిస్తూంటా.

తుఫానులో వంగుతానుగానీ,

ఎన్నడూ తలవంచను

చలికాలంలో చనిపోతాను

కానీ వసంతంలో పునర్జన్మిస్తాను

నేనొక పేరులేని చెట్టును.

ఇంగ్లీష్: మౌమిత ఆలం

తెలుగు: దేశరాజు

99486 80009

Next Story