ఉరవకొండలో ఇరువర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు

by Vemula.Srinu Prasad |

ఉరవకొండ తలారి వీధి, బోయ వీధి ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మహిళలు సహా 10 మందికి గాయాలయ్యాయి. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ..

ఉరవకొండలో ఇరువర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు
X

దిశ, ఉరవకొండ: ఉరవకొండ తలారి వీధి, బోయ వీధి ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మహిళలు సహా 10 మందికి గాయాలయ్యాయి. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. గాయపడిన వారిని వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story