- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ధనుర్మాసం నుంచి
మకరసంక్రమణం వరకు
ముగ్గులు వేసి నా జుట్టు ముగ్గబుట్టైందట
తీగలు చుక్కలు పెట్టిన
వేళ్ళు వంకరపోయాయట
నెలరోజుల వ్యాయామం నడుమును
ఇంద్రచాపం చేసేసిందట
పండగనాడు కట్టిన పట్టుచీర
మెరుపులు చూస్తూ మా వారి మెప్పుకోలు
పంటలు చేతికొచ్చిన ఆనందంతో
ఉబ్బితబ్బిబ్బైన గుమ్మి
పిండివంటల గాడుపొయ్యి బూడిద సెగ
కూతురు అల్లుడు మనవళ్ళ సందడికి
సర్దుకోవడానికి మరో రెండు రోజుల
చాకరి మిగిలేవుంది
ఒంటరి ఎద్దు గానుగలా ఇంత కష్టాన్ని
ఎంత యిష్టంగా చేసావో కదా..
లవ్యూ బంగారం అంటూ అరవై దాటిన
కుర్రమగని పలుకరింత
నడి వయసు దాటిన
రాణినైన నాకెంత పులకింతో
ఇన్నేళ్ల కాపురం నాలుగు పదులు
దాటిన పిదపకూడ
ఈ చిరు ప్రశంసే కదూ యిల్లాలి నుదుటి
చెమట తుడిచే ఆప్యాయతనింపే
మా వారి చేరుమాలు.
వస్తా ఎక్కడ పనులక్కడేవున్నాయి
యిష్టపడేలా వుండాలి కాని
కష్టపెట్టేలా కాదుకదా సంసార యానం
నడుస్తూనే వుండాలిలా పచ్చగానే
సెలవు.
-కపిల రామ్ కుమార్
98495 35033
- Tags
- Poem






