- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కాల్చేసే ఎండలో
కాయకష్టం చేస్తున్నావ్,
త్రివేణి, ఒళ్ళు దాచుకోకుండా,
వంగుతూ లేస్తూ
ఉన్న బలాన్నంతా ఇస్తున్నావ్
ఎండలోనే ఎండిపోతున్నావ్
చెమట, రక్తం ఇంకిపోయాక
ఇంటికి వెళ్తే, సూర్యుడి నిప్పుల
సెగలో నీ రేకుల పైకప్పు
వేగుతూ ఉంటుంది
అణచివేసే ఆస్ఫాల్ట్ వేడి
సాయంత్రం అయినా తగ్గదు
నేల వేడి గాలి వేడి నీళ్లు వేడి
ఎవరూ రారు ఎవరూ అడగరు
నువ్వు అక్కడే ఆవిరైపోయినా
ఎవరూ పట్టించుకోరు
నాకు నీ వేదన తెలుస్తోంది
కానీ నేను ఏమీ చేయలేను
ఏమీ మార్చలేను త్రివేణి
నువ్వు ఎండలోనే మాడిపో
పెగలని గొంతుతో రాయిలాగా,
కొండ మీద రాయుడిలాగా
నేనిక్కడే ఆగి చూస్తా
-ప్రయా (ప్రగతి యాధాటి)
76750 34380
- Tags
- Poem
Next Story






