- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈ అనంత విశ్వంలో నువ్వెంత
అణువంతైనా కానీ నీకు
ఈ తల పొగరెందుకు?
ఈ విశాల విశ్వంలో నీవు
నివసించే ఈ భూమి, సముద్రాలే
నీ కంటికి కన్పించని అణువంత..
మరి నీవెంత?
ఈ విశ్వం వయసుతో
పోల్చినప్పుడు నీ వయసెంత?
నీవు ఈ భూమిపై
ఉండే కాలం క్షణం మాత్రమే..
నీ కంటికి కనిపించే సూరీడు,
నక్షత్రాలు, గ్రహాలు.. మరి నీ కంటికి కన్పించని అసంఖ్యాక నక్షత్రాలు, కోటాను కోట్ల సూరీళ్లు..
అదీ విశ్వం..
దాని ముందు నువ్వెంత?
ఒక్క సారి అంతరిక్షంలోకి
వెళ్లి చూడు.. కోటానుకోట్ల
కోట్ల నక్షత్రాలు గ్రహాలు
స్వేచ్ఛగా పరిభ్రమిస్తున్నాయి..
లేశ మాత్రమైన భూమిపై
కోటానుకోట్ల జీవ రాశులు,
సముద్రాలు, నదీ జలాలు
స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి..
ఆ భూమి స్వేచ్ఛగా
ఆ సూరీడు చుట్టూ పరిభ్రమిస్తూ..
కోటానుకోట్ల జీవరాశులకు
ఆశ్రయం ఆహారం అందిస్తుంది.
భూమికి లేని ఆ గర్వం
ఆ భూమిపై నివసించే నీకెందుకు?
విశ్వంలోని భూమి ఆకాశాన్ని
జయించగలననే నీ పిచ్చి
భ్రమను చూస్తే నవ్వొస్తుంది...
క్షణ క్షణం నీలోని అణువులు
చస్తూ.. కొత్తవి పుడుతుంటాయి.
క్షణక్షణం కోటానుకోట్ల జీవరాశులు
చస్తూ.. కొత్తవి పుడుతుంటాయి..
అనంత విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు..
ఈ యుద్ధం, తంత్రం,
కుతంత్రం మారణహోమం..
ప్రకృతి విధ్వంసం, మత విద్వేషం
మరి ఎందుకు..?
క్షణ భంగురమైన ఈ ప్రాణం
అనంత వాయువుల్లో
కలవక ముందే..
సాటి వారిని ప్రేమించడం చెయ్యి
పోయినపుడు కాస్త
కన్నీరు కార్చేందుకైనా...
-శిరందాస్ శ్రీనివాస్
94416 73339
- Tags
- Poem






