మీరేమంటారు?

by Ravi |   (  Updated:2026-04-13 00:01:21  IST  )

Poem

మీరేమంటారు?
X

గెలిచాడని

నీతి, బలం ఉన్నవాడని కాదు

పదవిలో ఉన్నంత మాత్రాన

పలుకుబడి ఉన్నట్టు కాదు!

ప్రశ్నించడం లేదని

వ్యతిరేకత లేదని అనుకోరాదు

అడగడం మొదలు పెడితే

ఏ అధికారం అడ్డురాదు!

మనకు మనం పద్దతిగా ఉంటే

నిబద్దుడు అంటారు

అడిగితే కాని చేయనివాడిని

అల్పుడు అంటారు!

-జగ్గయ్య.జి

98495 25802

Next Story