- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

కవిత్వం ఉన్నంతకాలం
మనిషి మిగిలే ఉంటాడు
మనిషి మొదటిసారి ఆకాశాన్ని
చూసి ఆశ్చర్యపోయినప్పుడు
ఆ ఆశ్చర్యం గీతంగా మారింది
అదే కవిత్వం
నాటి వేద మంత్రాల నుంచి,
నేడు వీధి గోడలపై రాసిన నినాదాల దాకా
మనిషి శ్వాసలో నడిచినదీ కవిత్వమే
కవిత్వం కేవలం ఒక అలంకారం కాదు
బాధను భరించడానికి
ఆనందాన్ని పంచుకోవడానికి
అన్యాయాన్ని ప్రశ్నించడానికి
మనిషి కనుగొన్న సున్నితమైన ఆయుధమది
ఒక మంచి కవిత
చిన్న పంక్తిలో పెద్ద ప్రపంచాన్ని మోస్తుంది
ఒక ఉపమలో జీవితం దాగి ఉంటుంది.
ఒక మౌనంలో నినాదం వినిపిస్తుంది
ఇప్పుడు ఆ కవిత్వం
ఒక కూడలిలో
మార్గమధ్యంలో నిలబడి వుంది
కొత్త స్వరాలు, కొత్త వేదనలు, కొత్త భాష
అన్నీ కలిసిపోతున్నాయి
కొత్తగా ఆవిష్క్రుతమవుతున్నాయి
కానీ ఎక్కడో లోతు కోసం
ఒక సాంద్రత కోసం ఇంకా వెతుకుతోంది.
సోషల్ మీడియా వేగంలో పుట్టే పదాలు
కొన్నిసార్లు కవిత్వం అనిపిస్తాయి
కానీ కాలాన్ని తట్టుకునే కవిత
ఇంకా మనసు లోతుల్లోనే దాగివుంది
కవిత్వం అంటే
తాను జీవించే చివరి క్షణం దాకా
తనను తాను చదవడం
కవిత్వమంటే మాటల్లో కాకుండా
మౌనంలో వినిపించే అర్థాన్ని చదవడం
కవిత్వం ఉన్నంతకాలం
మనిషి మనిషిగా మిగిలే ఉంటాడు
(ప్రపంచ కవితా దినోత్సవం)
- వారాల ఆనంద్
94405 01281
- Tags
- Poem






