నేటి తరం

by Ravi |   (  Updated:2026-02-23 00:30:52  IST  )

Poem

నేటి తరం
X

ఆకర్షణలో కొట్టుకుంటూ

సోయగాల ఊబిలో కూరుకుని

అలంకరణల అగచాట్లు పడి

వచ్చిన రాబడికి బిల్లులు

చిట్టాలే ఎక్కువతో

తల్లిదండ్రుల బిల్లులు పెంచి

బాధ్యతల బందిఖానాలు,

పాపాయిల ముద్దుముచ్చట్లు

వంట ఇంటి ఘుమ ఘుమలు

భుజించడమే తప్ప

వార్చే ఊసు మాకొద్దని

జొమాటోలు, అమెజాన్‌లు

తరువాత హాస్పిటల్ బిల్లులు

పెంచుతున్న నేటి తరం

టార్గెట్‌లలో కొట్టుకుని

విలాసాల పేరుతో పబ్‌ల చుట్టూ తిరిగి

వేస్టేజినంతా కడుపులో కుక్కి

రోగాల ఖార్ఖానాలు పెంచకండి

సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి

ఆరోగ్యం పెంచి చక్కని యువతరం మాదని

చాటడం బాధ్యతగా పెట్టుకోండి

-అరుణ కమల

96764 43185

Next Story