కుటుంబ బంధం..

by Ravi |   (  Updated:2026-02-23 00:45:55  IST  )

Poem

కుటుంబ బంధం..
X

మానవీయ సంబంధాలకు

మూలాలు ఏవైనా

మానసిక అనుబంధాలకు

మూల్యాలు ఏమైనా

కుటుంబం పరివారం

అంటూ అల్లుకున్న జీవితం

నువ్వు నేను వాళ్లు వీళ్ళు

ఇలా మనందరి జీవనం

తప్పుకోలేని సంకెళ్లు

వేసి కుదించిన చెరసాల

ఒప్పు కాకున్నా సరిహద్దు

చెరపని బందిఖాన

జీనా హైతో మర్ మర్ కె జీవో

హర్ పల్ డర్ డర్ కె మరో

- సంజీవ్ గౌడ్

96766 35444

Next Story