- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆకలి రుచెరగదంటేటో
బాల్యాన్ని తచ్చాడాల్సిందే
పగిలిన పచ్చి సీతాఫలం కాయ చెబుతాది
చిలక కొలికిన జామకాయ కోసం
చెట్టెక్క లేక కిందపడిన గురుతులు చెబుతాయి
నిద్ర జాగరగదంటేమిటో
పసుల కాపరిని చూడాల్సిందే
ఎముకలు కొరికే చలిలో
మేకల మంద కాడ
మంచు దుప్పటి చెబుతాది
కాలం కలిసొచ్చిందంటేమిటో
కర్షకుని అడగాలి
కాడీ పాడికి అదును పదును
కలిసొచ్చినప్పుడంటాడు
బాల్యమంటేమిటో తెలియాలంటే
తడబడిన బుడిబుడి
అడుగులు చెబుతాయి
పడి లేచిన కెరటాల్లా....
బాలింత లాంటి బాల్యానికి
భవిష్య వాణి చెబుతాది
తలచుకుంటే
తలెత్తుకు నిలబడగలవని
నా బాల్యం చల్లగుండా...
ఆనాటి బతుకంతా సల్లకుండే....!
- నిశితాసి
97045 70198
- Tags
- Poem
Next Story






