- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పరిపక్వం కాని పండు
పుచ్చి బుర్రలైనట్లు
వికసించని మేధస్సు
నియంత్రిత చలనంలో
అవిటిగా మారింది
వెల్లివిరియని నైపుణ్యాల వాడి
లిప్త కాల ఫలితాలతో త్రుప్పు పట్టింది
కదలకుండా పనిచేసే
దేహంలో చురుకైన మెదడు
ఏఐ కౌగిలిలో ముడుచుక పోయింది
సాంకేతిక యావలో జిగిలేని దేహాలు
విదేహాల మోహకాంక్షలో కలబడుతున్నాయి
విరివిగా దొరుకుతున్న గారడి విద్యలు
అస్త్ర సన్యాస విన్యాసంగా
కట్టడి చేయలేని యంత్రాధిపత్యం
కొత్త రుచులతో ముంగిలికి
కోడింగ్ గాటు పడకుండా
అరచేతిలో సప్త సముద్రాల హోరు
వీక్షించకుండా ఫలితాల జోరు
దర్శించకుండా అనుభూతుల
జీబిలు నిత్యం చుట్టుముడతాయి
సామర్ధ్యాల లేమితో సుసాధ్యమయ్యే పనులు
సహజ వృత్తుల అవశేషాల మీద
సొగసుగా ముస్తాబవుతాయి
కుంచె పట్టకుండానే
పికాసోను మించిన కళాకారుడిగా
స్వరాలు మీటకుండానే గాన గంధర్వుడిగా
కలం పట్టకుండానే
అక్షర యోధుడిలా మారిపోవచ్చు
తీర్పులను కూర్పులను అందంగా అతికించవచ్చు
ఏళ్లుగా... వియోగులుగా... మదనపడితే
విస్తరించిన ప్రతిభా కాంతులు
టచ్ స్క్రీన్ జిలుగులకు కాంతి విహీనంగా
జ్ఞానపు లోతులను తూచిన ఐన్ స్టీన్
లేశమాత్ర నిడివిలో సాధించిన మస్తిష్కచాపం
ఆ దరికి చేరని నవాధునిక మెదడు
అలుగులా ఇంకా కుచించుకపోయింది
-బి.వేణుగోపాల్ రెడ్డి
99081 71441
- Tags
- Poem






