- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

‘ఇల్లు’ కన్న తలుపు చిన్నది
‘తలుపు’ కన్న తాళం చిన్నది
‘తాళం’ కన్న ‘తాళంచెవి’ చిన్నది
ఇంటి కంట్రోల్ చిన్న ‘కీ’ మాత్రమే
మన సుదీర్ఘ జీవితాన్ని నిర్ణయించేది..
చిన్న చిన్న తెలివైన కార్యాలే కదా !
చెట్టు కన్న కొమ్మ చిన్నది
కొమ్మ కన్న ఆకులు చిన్నవి
ఆకుల కన్న గింజలు చిన్నవి
బతకడం కన్న జీవించడం గొప్పది
తీసుకోవడం కన్న ఇవ్వడం గొప్పది
గింజలా పగిలి చెట్టై ఇవ్వడం గొప్పది !
స్నేహితులు నానా రకాలు..
ప్రతి ఏటా రాలిపోయే ‘ఆకులు’
గాలి వాటానికి విరిగే ‘కొమ్మలు’
కంటికి కనబడని లోతైన ‘వేర్లు’
చెట్టు ఉనికికి కారణమైన ‘గింజలు’
గింజల్లాంటి వాళ్లే కదా ప్రాణ మిత్రులు !
‘అనుమానం’ ఆనందాన్ని హరిస్తుంది
‘దురాశ’ దుఃఖ హేతువు అవుతుంది
‘నేను’ అనే గర్వం నిన్ను ఏకాకిని చేస్తుంది
‘షరతుల’తో జీవితం ఓటమిని ఇస్తుంది
‘ఈర్ష్య అసూయ’ దేహాన్ని చెదలై తింటుంది
‘నిష్కల్మష’ హృదయం ప్రశాంతత తెస్తుంది !
-మధుపాళీ
99497 00037
- Tags
- Poem






