ప్రేమ కవిత..

by Ravi |   (  Updated:2026-02-16 00:00:04  IST  )

Poem

ప్రేమ కవిత..
X

పక్కన నువ్వుంటే

ఉన్నట్టే తెలీదు

ఊపిరిలా....

లేకుంటే,

లేనట్టే తెలీదు

నేనంటూ ఉంటేగా...

ఎదుట నేనుంటే

చేయి విడువనంటావు

గొడవ పడుతుంటావు

ఘడియ కనబడకుంటే

గాయమై పోతావు

విషాద గేయమై పోతావు.

-డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931.

Next Story