విద్వేషపు మంటల్లో ప్రేమ సూర్యుడు..

by Ravi |   (  Updated:2026-02-16 00:30:39  IST  )

Poem

విద్వేషపు మంటల్లో ప్రేమ సూర్యుడు..
X

విద్వేషం పొగమంచై కమ్మిన వేళ

మనసు మండే సూర్యుడై ఉదయించాలి.

గోడలపై రాసిన నినాదాల కంటే

గుండెల్లో నాటిన ప్రేమనాదాలు వెలగాలి.

పేర్లతో విభజించిన వీధుల మధ్య

పలకరింపుల పూలదారి విరియాలి.

మతం గీసిన గీతల నేలపై

మనుష్యత్వం మొలకెత్తాలి.

చీకటిని తరిమేందుకు చిన్నదీపం చాలు

మనసు విరిగేందుకు చిన్న మాట చాలు.

చేతులు కలిస్తే సరిహద్దులు చెరిగిపోతాయి,

మనసులు కలిస్తే భయాలు పారిపోతాయి.

సోదరభావం ఓ సజీవ నదీ ప్రవాహం

ఏ అడ్డుకట్టలూ దాని గమ్యాన్ని ఆపలేవు.

ప్రేమ ఒక విత్తనం

దాన్ని పాతితే శాంతి అడవిగా విస్తరిస్తుంది.

మనసుల మధ్య గోడలు కూలినరోజు

దిక్కులన్నీ దీప కాంతులవుతాయి.!

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story