సర్పంచ్

by Ravi |   (  Updated:2025-12-08 00:15:38  IST  )

Poem

సర్పంచ్
X

తన బలం బలగం

చూపించాలని ఒకరు,

అదృష్టం పరీక్షించుకుందామని ఒకరు,

ఎమ్మెల్యే అండదండలు

ఉన్నాయని ఒకరు,

ఇన్నాళ్లు పెద్ద మనుషులు

చేసింది చాలు, మాకూ

ఓ అవకాశం ఇవ్వండని యువత,

గత ఐదేళ్లలో కరోనా వచ్చి

నిధులు లేక ఏం చేయలేకపోయా,

మళ్లీ గెలిపించండని ఓ మాజీ,

మహిళా సాధికారతకు

నన్ను ఎన్నుకోండని ఓ స్త్రీ,

సంక్షేమ పథకాలు ఇస్తుంది..

మా పార్టీనేనని ఒకరు,

ఇలా భయపెట్టి ఒకరు,

బ్రతిమిలాడి మరొకరు

ఏమి ఇచ్చుకోలేననొకరు,

గెలిపిస్తే ఇస్తాననొకరు

ఓట్లు అడుగుతూ

పల్లెల్లో సందడి చేస్తుంటే,

ప్రలోభాలకు లొంగకుండా,

ఊరికి ఊపిరి సలపకుండా

చేసే వారికి కాకుండా,

అభివృద్ధి వైపు ఉరకలెత్తించే

వారికి అమూల్యమైన

ఓటు వేసి గెలిపించుకోవాలి!!

-జక్కుల శ్రీనివాస్

97019 38358

Next Story