దృశ్యం!

by Ravi |   (  Updated:2025-11-30 23:30:16  IST  )

Poem

దృశ్యం!
X

ఊరించే మాటలు

చూపులు కాదని

రెండు రూకలకోసం

గుంపుల వెంట

ఎడతెగని పరుగు!

నిశ్శబ్దంగా పహారాకాస్తున్న బలగాలు

ఒక్కసారిగాబాణాలు

ఎక్కు పెట్టాయి!

సమూహాల పేరు చెప్పి నేతలు..

కీర్తి కిరీటాలు పెడతామంటూ

పహారా కాస్తున్న సేనలు!!

ఆత్మ ఒక్కటే..ముఖాలు ఒక్కటే!

చేసే గాయాలు ఒక్కటే !!!

ఊహల మబ్బుల నుండి

రాలే వెళుతురు చినుకులు

ముత్యపు చిప్పలో పడిందిలేదు!

ఒంటినిందా రక్తం చేసి

ఆగ్రహంతో ఊగి

వారు చీకటిలో మాయమవుతారు!

కలలు దేహాన్ని తేలిక చేసి

తెల్లారగానే

దిగులు సుడులు తిరుగురుంది!

ఇలాగే

ఎప్పుడూనూ!-

-తంగెళ్లపల్లి కనకాచారి

Next Story