చేదు నిజం!

by Ravi |   (  Updated:2025-12-01 00:30:25  IST  )

Poem

చేదు నిజం!
X

పుస్తకాలు పట్టాల్సిన వయసు

నాయకుడి చేతిలో జెండాగా మారే...

పాఠాలు వల్లే వేయాల్సిన నోళ్ళు

అవినీతి నోటికి నాలుక అయ్యే...

నిగ్గదీసి అడగాల్సిన ధైర్యం

బిర్యానీ పొట్లానికో,

ఐదు వందల నోటుకి కట్టుబడే...

మేకల మందలా

రోజూ ఆటోల్లో డీ సి ఎం లో

చెత్త సరస్వతినీ మోసుకుంటూ..

అబద్దాల జీవితాల్ని అంటగట్టడానికి

యువత ఉరకలేస్తుంది....

రాని ఉద్యోగాల కోసం

లైబ్రరీ గుమ్మాలకు

ఊరి వేసుకుంటూ ...

దేశానికి వెన్నుముకలు

కావలసిన కుర్రాళ్ళు,

అవినీతి నాయకుల వలలో

చేవ చిక్కిన చేపలు...

ఇది అంతే

ప్రజాస్వామ్యం ఇప్పుడు

నోటుకు బానిస!

పుష్యమి సాగర్

90103 50317

Next Story