- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మెతుకు సారమంత పిండి
జ్ఞాన అక్షరముగా మలచి
నేల రాలిపడిన ప్రాణానికి
కలంతో శస్త్రచికిత్స చేసి
సందించే విప్లవ అస్త్రానిస్తున్నాను
కాళ్ళమీద రెక్కలతో
చెమట బిందువుల వాసనతో
నీ హక్కుల నెత్తురు కోసం
పతనమైన మనసుకు
శస్త్ర చికిత్స చేస్తవో..
ఉక్కుపాదంతో పిడికిలై ఉద్యమిస్తవో..
మానని గాయాలకు లేపనం పుస్తవో..
జీవితాంతం చేతులెత్తి
జై..కొడుతూ నమస్కరిస్తవో..
బానిసగా వుంటావో..
నువ్వే నిర్ణయించుకో!
-పగిడిపల్లి సురేందరు
80748 46063
- Tags
- Poem
Next Story






