ఏడుపంటేనే సుఖం!

by Ravi |   (  Updated:2025-12-01 00:15:53  IST  )

Poem

ఏడుపంటేనే సుఖం!
X

నాకేడుపంటే చాలా ఇష్టం

కనీసం అప్పుడప్పుడైనా

ఏడవాలనుకుంటాను

అందులోని సుఖం

అనుభవిస్తేనే కానీ అర్థం కాదు

లోలోన గడ్డకట్టుకుపోయిన

దుఃఖపు కొండల్ని

గుండెల్ని బాదుకుంటూనైనా...

కన్నీళ్ళలా కరిగించినప్పుడే

మనసుకెంతో హాయనిపిస్తుంది!

బాధలోనూ అంతులేని

సుఖం దాగుంటుందనీ...

ఒక్కసారిగా గుండెని పురేసి

పిండేసినట్టుగా - శూన్యత

కళ్ళ ముందు కనిపిస్తూంటే...

ఉన్నపళంగా ఊపిరి ఆగి

వేగం పెంచి కొట్టుకుంటుంటే...

గుండె ఆ బాధ తట్టుకోలేక

తల్లడిల్లిన వైనం చూస్తూంటే...

అమాంతంగా అతిమధురాన్ని

నేరుగా నా గుండెల్లోకి

ఒంపినట్టే ఉంది!

నిజానికి - సుఖం అంటే అది!

స్వర్గం అంటే అది!

-బాలాజీ పోతుల

81792 83830

Next Story